ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 6:46 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఎన్పీయే కార్యక్రమానికి హజరయిన డీజీపీ అనంద్

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
శనివారం  నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన 78వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్కు రాష్ట్ర డీజీపీ సివి అనంద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి  కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని, పరేడ్ను సమీక్షించి, శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.
డీజీపీ మాట్లాడుతూ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లోనే ఉండటంతో, తెలంగాణ పోలీసులకు, అకాడమీకి దశాబ్దాలుగా పరస్పర సమన్వయంతో కూడిన సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. దాదాపు రెండు గంటల పాటు జరిగిన  ఈ పరేడ్, శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. శిక్షణ ముగించుకుని విస్తృతమైన ప్రపంచంలోకి అడుగుపెడుతున్న వారికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయని అన్నారు.
బ్రేక్ ఫాస్ట్ అనంతరం ప్రొబేషనర్స్,  ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న అధికారులు, పదవీ విరమణ చేసిన అధికారులను కలిసారు.
=====================